Jubilee Hills By Election Sensational : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దే విక్ట‌రీ

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ..డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

Hello Telugu - Jubilee Hills By Election Sensational

Hello Telugu - Jubilee Hills By Election Sensational

Jubilee Hills : హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఎట్ట‌కేల‌కు సీఎం రేవంత్ రెడ్డి త‌న మాట నెగ్గించుకున్నారు. ద‌గ్గ‌రుండి ఛాలెంజ్ చేసి మ‌రీ తాను నిల‌బెట్టిన న‌వీన్ యాద‌వ్ ను గెలిపించాడు. దీంతో హైక‌మాండ్ వ‌ద్ద త‌న ప‌ర‌ప‌తి ఈ గెలుపుతో పెరిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌తీ రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి లీడ్ లో ఉన్నారు. చివ‌రి వ‌ర‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక పోయింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న పరువు కోల్పోయింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, కొత్త అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ప్ర‌చారం చేసిన ఆ పార్టీ అభ్య‌ర్థికి డిపాజిట్ కూడా రాలేదు. భారీ మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ల్లాల న‌వీన్ యాద‌వ్. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కంటే 24,658 పై చిలుకు మెజారిటీ సాధించారు.

Jubilee Hills By Elections Results

ఇదిలా ఉండ‌గా జూబ్లీహిల్స్ (Jubilee Hills) శాస‌న స‌భ స‌భ్యుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. చివ‌ర‌కు ఈనెల 11న పోలింగ్ జ‌రిగింది. ముందుగా త‌న‌కు సీటు కావాల‌ని ప‌ట్టుప‌ట్టారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్. కానీ ఆయ‌న‌ను తెలివిగా సైడ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. త‌నకు కావాల్సిన అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ కు టికెట్ ఇవ్వాల‌ని , గెలిపించుకుని తీరుతానంటూ శ‌ప‌థం చేశారు. అజ్జూ భాయ్ కి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న‌కు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఉంది. అంత‌లోపు ఎన్నిక‌ల్లో గెల‌వాలి లేదా గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ విజ‌యంతో హైకమాండ్ వ‌ద్ద సీఎం హ‌వా కొంచెం పెరిగిన‌ట్లు భావించ‌క త‌ప్ప‌దు.

Also Read : Reliance AI Data Center in AP Interesting : ఏపీలో రిల‌య‌న్స్ ఏఐ డేటా సెంటర్‌

Exit mobile version