హైదరాబాద్ : బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణితో పాటు పలువురు హిందూ బంధువులు భగ్గుమన్నారు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్. తమ మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేశారంటూ హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే అన్వేష్ కు నోటీసులు పంపించారు. అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తను దేశాలు తిరుగుతూ వాటి ప్రాముఖ్యత, చరిత్ర గురించి చెబుతూ పాపులర్ అయ్యాడు యూట్యూబర్ అన్వేష్. మహిళల వస్త్రధారణ గురించి అసభ్యకరంగా మాట్లాడాడంటూ తనపై ఫిర్యాదు చేశారు. దీంతో తనను పట్టుకునేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇవాళ కీలక ప్రకటన చేశారు. తను నిర్వహిస్తున్న ఇన్ స్టా ఖాతాకు సంబంధించిన వివరాలు కావాలంటూ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ కు లేఖ రాశారు పంజాగుట్ట పోలీసులు.
హిందువుల మనోభావాలను కించ పరిచేలా అన్వేష్ కామెంట్స్ చేయడం పట్ల పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హిందూ దేవతలపై, ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపదిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను మత సంస్థలు అతనిపై పలు కేసులు నమోదు చేశాయి. నటి శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అతను ఒక వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఈ వివాదం ప్రారంభమైంది, ఇది మతపరమైన వ్యక్తులను అవమానించిందని విమర్శకులు ఆరోపించారు. పోలీసులు అన్వేష్‌పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు .ఇదిలా ఉండగా ‘నా అన్వేషణస పేరుతో అన్వేష్ పాపులర్ అయ్యాడు. 125కి పైగా దేశాలను సందర్శించాడు.
