PM Modi Important Updates on Srisailam : 16న శ్రీ‌శైలానికి రానున్న ప్ర‌ధాని

భారీ ఎత్తున భ‌ద్రతా ఏర్పాట్లు

Hello Telugu - PM Modi Important Updates on Srisailam

Hello Telugu - PM Modi Important Updates on Srisailam

PM Modi : నంద్యాల జిల్లా : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అక్టోబ‌ర్ 16న నంద్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్ర‌మైన శ్రీ‌శైలం శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించు కోనున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా కూట‌మి స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భద్రత చర్యలపై సమీక్ష నిర్వహించారు. IGP ఆర్.కె రవికృష్ణ ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పరిపాలన విభాగంలోని మీటింగ్ హాల్ నందు భద్రత ఏర్పాట్ల గురించి సంబంధిత పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

PM Modi Important Update

ప్రధానమంత్రి రాక సందర్భంగా హెలిపాడ్స్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన‌ చర్యలు, ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిన పికెట్లు, చెక్ పోస్ట్ లు , మోదీ పర్యటించే ప్రదేశాలలో భద్రత కట్టుదిట్టంగా నిర్వహించేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప‌లు సూచ‌న‌లు చేశారు ర‌వికృష్ణ‌.

ఈ కార్యక్రమంలో ఆర్.కె రవికిష్ణతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ , గ్రేహౌండ్స్ డిఐజి బాపూజీ , నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ , ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,డిజిపి ఆఫీస్ అధిరాజ్ సింగ్ సింగ్ రాణా, ఈ జీ అశోక్ కుమార్, సిఐడి ఎస్పి శ్రీధర్ రావు, అదనపు ఎస్పీ యుగంధర బాబు, ఆత్మకూరు డిఎస్పి రాంజీ నాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు , నంద్యాల జిల్లా సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

Also Read : Talasani Srinivas Yadav Fired on Congress Govt : పెంచిన ఆర్టీసీ ఛార్జీలు త‌గ్గించాలి : త‌ల‌సాని

Exit mobile version