Talasani Srinivas Yadav Fired on Congress Govt : పెంచిన ఆర్టీసీ ఛార్జీలు త‌గ్గించాలి : త‌ల‌సాని

బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్

Hello Telugu - Talasani Srinivas Yadav Fired on Congress Govt

Hello Telugu - Talasani Srinivas Yadav Fired on Congress Govt

Talasani Srinivas Yadav : హైద‌రాబాద్ : పెంచిన ఆర్టీసీ ఛార్జీల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు మాజీ మంత్రి. ఓ వైపు ఫ్రీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామంటూనే ఇంకో వైపు ఛార్జీల మోత మోగిస్తున్నార‌ని ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయాణికులు, ప్రజలందరినీ కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav). ఫ్రీ బస్ అంటూనే మహిళల కుటుంబ సభ్యులకు బస్ ఛార్జీల పెంచ‌డం దారుణ‌మ‌న్నారు.

Talasani Srinivas Yadav Slams Congress

గతంలో ఎన్నడు కూడా లేదు 10 రూపాయల పెంపు అనేదన్నారు. దీని వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై పెను భారం ప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . చాలా మంది ప్రజలు డబ్బులు ఎక్కువగా పెట్టీ ఆటోలలో, కార్లలో పోలేరన్నారు. అలాంటి వారికి ఇది భారం అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చాలా దేశాలలో బస్ ఉచితంగానే ఉంటుందన్నారు. అలాంటిది మన రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ అని వారి కుటుంబ సభ్యులకు డబుల్ ఛార్జీ చేయడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. రోజు రోజుకు ఆర్టీసీని ఆగ‌మాగం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాము అడ్డుకుని తీరుతామ‌ని ప్ర‌కటించారు.

Also Read : KTR Fired on Congress Govt : మోసానికి చిరునామా కాంగ్రెస్ పాల‌న : కేటీఆర్

Exit mobile version