PM Modi Warning to Pakistan : అణుబాంబు బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం : మోదీ

పాకిస్తాన్ బ్లాక్ మెయిల్ చేస్తే తాట‌తీస్తాం

Hello Telugu - PM Modi Warning to Pakistan

Hello Telugu - PM Modi Warning to Pakistan

PM Modi : ఢిల్లీ – దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ (PM Modi) నిప్పులు చెరిగారు దాయాది పాకిస్తాన్ పై. 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం 143 కోట్ల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు పీఎం. పాకిస్తాన్ ప‌దే ప‌దే అణుబాంబులు వేస్తామంటూ ఇండియాను బెదిరించ‌డం ప‌ట్ల ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ సిందూర్ తో బిగ్ షాక్ ఇచ్చామ‌ని, అయినా త‌న తీరు మార్చు కోవ‌డం లేద‌న్నారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, ఇకపై ఎవరి బ్లాక్‌మెయిల్‌ నడవదని వార్నింగ్ ఇచ్చారు. ఇదే రీతిన‌ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జ‌వాబు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టికైనా నీళ్లు, ర‌క్తం క‌లిసి ప్ర‌వ‌హించ‌వ‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ.

PM Modi Strong Warning to Pakistan

ఇదే స‌మ‌యంలో స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా దేశ ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు ప్ర‌ధాని మోదీ (PM Modi). దీపావళి లోపు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందన్నారు. ప్ర‌జ‌ల‌కు డ‌బుల్ బొనాంజా ఇస్తామ‌న్నారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకు వస్తున్నామ‌ని చెప్పారు. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నామ‌ని అన్నారు. దీనివల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయని చెప్పారు న‌రేంద్ర మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంద‌న్నారు. కీలక ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. . నాకు యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంద‌న్నారు.

ఫైటర్‌ జెట్లకు మేడిన్‌ ఇండియా ఇంజిన్లపై దృష్టి పెడతామ‌న్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామ‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. 10 కొత్త అణు రియాక్టర్ల వేగంగా పనులు జరుగుతున్నాయని వెల్ల‌డించారు. త్వరలో మేడిన్‌ ఇండియా చిప్స్‌ మార్కెట్‌లో రాజ్యమేలుతాయని అన్నారు.. 2047 నాటికి న్యూక్లియర్‌ ఎమర్జీని 10 రెట్లు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.. డీజిల్‌, పెట్రోల్‌ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు మోదీ. సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వైపు దేశ యువత దృష్టి పెట్టాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Tirupati Auto Drivers Protest Sensational : తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన

Exit mobile version