Auto Drivers Protest : తిరుపతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, యువతలు, బాలికలకు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఉచితంగా బస్సు పథకం ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీలోని తిరుపతిలో ఆటో డ్రైవర్లు . సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు పథకం తమ పాలిట శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పథకానికి వ్యతిరేకం కాదని, అయితే తమకు ఉపాధి లేకుండా పోతుందని వాపోయారు. దీని వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు.
Auto Drivers Protest in Tirupati
తిరుపతి పట్టణంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ గొంతులకు తాళ్లు బిగించుకుని ఆందోళన చేపట్టారు. వీరు చేపట్టిన ఆందోళన సంచలనం రేపింది. పట్టణ వాసులు పూర్తిగా వారికి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో తమకు ప్రత్యామ్నాయం చూపాలని, లేకపోతే ప్రతి నెల నెలా పెన్షన్ , వేతన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు. ఇప్పటికే ఆయిల్ ధరల పెంపు కారణంగా తమ కుటుంబాలను పోషించ లేక పోతున్నామని పేర్కొన్నారు. తమ కడుపులు కొట్టేందుకే ఏపీ కూటమి సర్కార్ ఫ్రీ బస్సు పథకం తీసుకు వచ్చిందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు శుక్రవారం సాయంత్రం నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read : Ex CM KCR Alarming : స్వాతంత్ర ఫలాలు చివరి గడపకు చేరాలి : కేసీఆర్
