BJP Chief Madhav – AP Growth : కేంద్రం స‌హ‌కారం ఏపీకి ప్రోత్సాహం

బీజేపీ చీఫ్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు

Hello Telugu - BJP Chief Madhav - AP Growth

Hello Telugu - BJP Chief Madhav - AP Growth

BJP Chief Madhav : అమ‌రావ‌తి – కేంద్రం స‌హ‌కారంతో ఏపీ అన్ని రంగాల‌లో ముందుకు దూసుకు పోతోంద‌ని అన్నారు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్ (BJP Chief Madhav). గురువారం ఒంగోలులో జ‌రిగిన‌ ఛాయ్ పే చర్చ కార్యక్రమం లో మాట్లాడారు. కోవిడ్ సమయంలో వాణిజ్య రంగం సంక్షోభంలో ఉండడంతో పొగాకు పంటకు మంచి ధర లభించిందన్నారు. తద్వారా తదుపరి ఏడాదిలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన సమయం ఇద‌న్నారు. ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయని చెప్పారు మాధ‌వ్.

AP BJP Chief Madhav Key Comments

ట్రంప్ విధిస్తున్న అడ్డ దిడ్డమైన సుంకాలతో మన వాణిజ్య రంగం పైన తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో మెరుగైన పరిపాలన జరుగుతోందని చెప్పారు. ప్రజల సంక్షేమం , అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. కేంద్రం సహకారంతో ఏడాది రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. వీటి ద్వారా సంపద సృష్టి జరుగుతుందని స్ప‌ష్టం చేశారు బీజేపీ చీఫ్‌. లిక్కర్ స్కాంలో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు. అరువు తెచ్చుకున్న జనాలతో జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్ర‌క‌టించారు.

Also Read : TTD Chairman Alarming : విద్యార్థినుల హాస్టల్ సౌకర్యాలు పెంచాలి : బీఆర్ నాయుడు

Exit mobile version