PM Modi Important Comments : గిరిజ‌నుల ఆరాధ్య దైవం కొమ‌రం భీమ్

నిజాం దురాగ‌తాల‌పై ఎక్కు పెట్టిన బాణం

Hello Telugu - PM Modi Important Comments

Hello Telugu - PM Modi Important Comments

PM Modi : న్యూఢిల్లీ : నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో కొమరం భీమ్ కొత్త బలాన్ని నింపాడని కొనియాడారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ (PM Modi). కొమరం భీమ్ కోట్లాది ప్ర‌జ‌ల‌ హృదయాలపై, ముఖ్యంగా గిరిజన సమాజంపై చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆనాటి నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆయన కొత్త బలాన్ని నింపారని పేర్కొన్నారు. ఆదివారం ప్ర‌తి నెలా నిర్వ‌హించే మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ‘మన్ కీ బాత్’ కు స్వాగతం పలుకుతూ ఈ రోజుల్లో దేశం మొత్తం పండుగ ఉత్సాహంలో మునిగి పోయిందని అన్నారు.

PM Modi Key Comments on Mana ki Baat

కొన్ని రోజుల క్రితం మనమందరం దీపావళిని ఘ‌నంగా నిర్వ‌హించామ‌న్నారు. ఛాత్ మహాపర్వం సంస్కృతి, ప్రకృతి, సమాజం మధ్య లోతైన ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తూ వ‌చ్చింద‌న్నారు ప్ర‌ధాని. సమాజంలోని ప్రతి వర్గం ఛాత్ ఘాట్ల వద్ద కలిసి వస్తుంది. ఈ దృశ్యం భారతదేశ సామాజిక ఐక్యతకు అత్యంత అందమైన ఉదాహరణ అని పేర్కొన్నారు న‌రేంద్ర మోడీ.. మీరు ఎక్కడ ఉన్నా దేశంలో లేదా ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా, మీకు అవకాశం లభిస్తే ఛాత్ పండుగలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఛాత్ మహాపర్వ సందర్భంగా దేశ వాసులందరికీ, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పూ ర్వాంచల్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.

Also Read : Montha Cyclone Sensational : ‘మొంథా’ తుఫాన్ పై ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్తం

Exit mobile version