Montha Cyclone Sensational : ‘మొంథా’ తుఫాన్ పై ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్తం

ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశం

Hello Telugu - Montha Cyclone Sensational

Hello Telugu - Montha Cyclone Sensational

Montha Cyclone : అమ‌రావ‌తి : వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే అన్ని డిపార్టుమెంట్లు, కలెక్టర్ల సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.
ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని, తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇపటికే తుఫాను ప్రభావిత 11 జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల చేశామ‌న్నారు. ఇప్పటికీ సిద్ధంగా ఉన్న 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయ‌ని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ సమన్వయ అధికారులను కూడా నియమించామ‌న్నారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని జిల్లా క‌లెక్ట‌ర్లకు స్ప‌ష్టం చేశారు.

Montha Cyclone Updates

నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేయాల‌ని, బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం నిషేధించాలని ఆదేశించారు సీఎం. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని అన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మొబైల్ టవర్లు సజావుగా పనిచేసేలా చూడాలని, జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచు కోవాల‌ని కోరారు.

Also Read : CM Revanth-KC Venugopal Important Meet : కేసీ వేణుగోపాల్ తో సీఎం భేటీ

Exit mobile version