Donald Trump : అమెరికా – ఉక్రెయిన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాపై ఉక్రెయిన్ యుద్దానికి దిగాలని అనుకోవడం పెద్ద తప్పిదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. లేక పోతే తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉంటుందన్నారు. తాను యుద్దాన్ని కోరు కోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యుద్దాలు చోటు చేసుకోకుండా తాను శాంతియుత చర్చలను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు ట్రంప్ (Donald Trump). ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యుద్దం వల్ల నష్టం తప్ప ఇంకేమీ ఉండదన్నారు. తాను , రష్యా చీఫ్ పుతిన్ తో కలిసి చర్చలు జరపడం జరిగిందన్నారు. ఇందులో కీలకమైన అంశాలపై చర్చకు వచ్చినా ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న వార్ గురించే ఎక్కువ సేపు ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు ట్రంప్.
Donald Trump Key Comments on Russia-Ukraine War
కాగా దురాక్రమణదారుడి దేశంపై దాడి చేయకుండా యుద్ధం గెలవడం అసాధ్యం కాకపోయినా చాలా కష్టం అని ట్రంప్ అన్నారు. అమెరికాలోని యుఎస్ పార్క్ పోలీస్ అనకోస్టియా ఆపరేషన్స్ ఫెసిలిటీలో ఫెడరల్ దళాలను సందర్శించారు. రష్యాపై ఉక్రెయిన్‌ను తిరిగి పోరాడటానికి అనుమతించనందుకు జో బైడన్ ను ట్రంప్ విమర్శించారు, మాజీ అధ్యక్షుడిని చాలా అసమర్థుడు అని పిలిచారు. గెలిచే అవకాశం లేదు. ఉక్రెయిన్, రష్యా విషయంలో కూడా అంతే. రష్యా ఉక్రెయిన్‌పై ఒక నెలలోపు అతిపెద్ద డ్రోన్, క్షిపణి దాడిని ప్రారంభించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ ఘటనలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగిన సమావేశం తర్వాత ఈ దాడులు జరగడం విశేషం.
Also Read : IAS Lakshmisha New Innovation : మట్టి వినాయకులతో రికార్డ్ సృష్టించాలి
