PM Modi: న్యూఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా భారత సెమికాన్ మిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంగళవారం సెమికాన్ ఇండియా 2025 జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోదీ (PM Modi). ప్రారంభ ప్రసంగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆధారం కీలకమైన ఖనిజాలు అని, దేశం క్రిటికల్ మినరల్స్ మిషన్ పై పని చేయడం ప్రారంభించిందని అన్నారు.
PM Modi Key Comments
న్యూఢిల్లీలోని యశోభూమిలో ‘సెమికాన్ ఇండియా 2025’ ప్రారంభోత్సవం జరగడం తనకు ఆనందంగా ఉందన్నారు. అంతే కాదు తనను ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల మరింత సంతోషం కలుగుతోంద్నారు మోదీ. ప్రభుత్వం భారత సెమికాన్ మిషన్ , డిజైన్-లింక్డ్ ప్రోత్సాహక పథకం తదుపరి దశపై పని చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత సెమికాన్ మిషన్ తదుపరి దశపై తాముఉ పని చేస్తున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందన్నారు. ఔత్సాహికులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు.
భారతదేశంలో తయారయ్యే అతి చిన్న చిప్ ప్రపంచంలో అతిపెద్ద మార్పునకు దారితీసే రోజులు ఎంతో దూరంలో లేవని మోదీ అన్నారు. ప్రభుత్వం కొత్త DLI (డిజైన్-లింక్డ్ ఇన్సెంటివ్) పథకానికి ఒక రూపాన్ని ఇవ్వబోతోందని స్పష్టం చేశారు. ఇందులో ఇండియా ప్రపంచానికి ఆదర్శ ప్రాయంగా మారాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
Also Read : TG High Court Shocking : కేసీఆర్, హరీష్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
