TG High Court : హైదరాబాద్ – కాళేశ్వరం కమిషన్ విషయంలో విచారణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు (TG High Court). తెలంగాణ ప్రభుత్వం శాసన సభ సాక్షిగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించడంతో తక్షణమే గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవతవకలు జరిగాయని ఆరోపించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు శాసన సభ సాక్షిగా విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అవినీతి, ఆరోపణలపై ఇప్పటికే సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర సర్కార్ కు లేఖ రాయడం కలకలం రేపింది.
TG High Court key Verdict
దీనిని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు లు కలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోరుతూ కోర్టులో మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది కోర్టు. ఈ సందర్బంగా పలు వాదోప వాదనలు జరిగాయి. చివరకు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావులు దావాలో. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
Also Read : JD Lakshmi Narayana Shocking Comments : ఉద్యోగులపై విచారించే పవర్ సీబీఐకి ఉండదు
