PM Modi : మిజోరం : మిజోరం తొలి రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు దేశం పట్ల దీర్ఘకాలంగా నిబద్ధతతో ఉన్నారని ప్రశంసించారు. ఐజ్వాల్ (సైరాంగ్) నుండి న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను మిజోరంలోని ఐజ్వాల్‌లో ప్రారంభించారు. మిజోరం రాజధానిని తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే రూ. 8,070 కోట్లకు పైగా విలువైన బైరాబి-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు.
PM Modi New Innovation
కాగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మోదీ (PM Modi) ఐజ్వాల్‌కు చేరుకోలేక పోయారు, కాబట్టి మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి వర్చువల్‌గా ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రజల ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నుండి ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుందన్నారు. కఠినమైన భూభాగంతో సహా అనేక సవాళ్లను అధిగమించి, ఈ బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ వాస్తవంగా మారిందన్నారు.
తమ ఇంజనీర్ల నైపుణ్యాలు, తమ కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేసిందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్త లైన్ ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీతో మిజోరాంలోని సైరాంగ్‌ను నేరుగా కలుపుతుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధా నించడంలో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని నొక్కి చెప్పారు. దేశం పట్ల మిజోరాం ప్రజల దీర్ఘకాల నిబద్ధతను కూడా ప్రధాని ప్రశంసించారు.
Also Read : Nepal New PM Sushila Karki Sensational : నేపాల్ ప్రధానమంత్రిగా సుశీలా కర్కి ప్రమాణం
