Nepal New PM Sushila Karki Sensational : నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి ప్ర‌మాణం

దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా రికార్డ్

Hello Telugu - Nepal New PM Sushila Karki Sensational

Hello Telugu - Nepal New PM Sushila Karki Sensational

Sushila Karki : నేపాల్ : నేపాల్ దేశ తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రిగా తొలి మ‌హిళా నాయ‌కురాలు సుశీలా క‌ర్కి (Sushila Karki) ప్ర‌మాణ స్వీకారం చేశారు. అంత‌కు ముందు నేపాల్ పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేశారు. నిన్న‌ రాత్రి నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన తొలి మహిళా ప్రధానమంత్రి కావ‌డం విశేషం. ఖాట్మండులోని అధ్యక్ష నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె కొలువు తీరారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆమెతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇక అధ్యక్ష కార్యాలయం జారీ చేసిన నోటీసు ప్రకారం సెప్టెంబర్ 12 రాత్రి 11 గంటల నుండి సభ రద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నేపాల్ లో నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా తాజా పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి మార్చి 21, 2026 తేదీని ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపింది అధ్య‌క్ష కార్యాల‌య భ‌వ‌నం.

Nepal New PM Sushila Karki

సోషల్ మీడియాపై నిషేధం కారణంగా దేశ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న కె పి శర్మ ఓలి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న పెట్టేబేడా స‌ర్దుకుని దుబాయ్ కి పారి పోయాడు. ఆర్మీ స‌హ‌కారంతో. త‌ను గ‌త్యంత‌రం లేక త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది. రోజుల తరబడి కొనసాగిన రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికారు. హిమాలయ దేశం దశాబ్దాలుగా చూసిన అత్యంత దారుణమైన అశాంతి నేపథ్యంలో ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మూడు రోజుల తర్వాత, అధ్యక్షుడు పౌడెల్ ఈ సాయంత్రం 73 ఏళ్ల కర్కితో ప్రమాణ స్వీకారం చేయించారు ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా సుశీలా క‌ర్కికి హృదయ పూర్వక అభినందనలు. మీరు దేశాన్ని రక్షించడంలో విజయం సాధిస్తార‌ని పేర్కొన్నారు రాష్ట్ర‌ప‌తి.

ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి నేపాల్ ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ ప్రభుత్వ అధికారులు, భద్రతా ముఖ్యులు, దౌత్య సమాజ సభ్యులు హాజరయ్యారు. ఖాట్మండులోని మహారాజ్‌గంజ్‌లోని శీతల్నివాస్‌లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల జనరల్ జెడ్ గ్రూపుకు చెందిన యువకులు విజయోత్సవం జరుపుకున్నారు. విజయవంతం అవ్వండి, దేశాన్ని రక్షించండి, నిర్మించండి పోస్టుల‌తో నిండి పోయింది సోష‌ల్ మీడియా.

Also Read : Thalapathy Vijay Huge Meeting : తిరుచ్చిలో ద‌ళ‌ప‌తి విజ‌య్ మీట్ ది పీపుల్

Exit mobile version