PM Modi : ఢిల్లీ : భారత దేశానికి 17వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi). ఆయన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందన్నారు. సీపీ రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకు అంకితం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తీసుకు వచ్చేలా చేశారన్నారు. అణగారిన వర్గాల సాధికారతకు ఆయన జీవితం అంకితం చేశారని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలను ఆయన బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు మోదీ. అత్యుత్తమ ఉప రాష్ట్రపతిగా ఉంటారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
PM Modi Praises CP Radhakrishnan
ఇదిలా ఉండగా నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ తన సమీప ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై భారీ తేడాతో గెలుపొందారు. మొత్తం పార్లమెంట్ లో 781 ఓట్లకు గాను 14 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోలేదు. ఓటుకు దూరంగా ఉన్నారు. ఇందులో కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీకి నాలుగు ఓట్లు ఉన్నాయి. ఇక ఇండియా కూటమి తరపున పోటీ చేసిన తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ సందర్బంగా గెలుపొందిన సీపీ రాధాకృష్ణన్ కు కేంద్ర మంత్రులు, ఓటు వేసిన ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి ఎన్నిక తీర్పును తాను స్వీకరిస్తున్నానని లేఖ విడుదల చేశారు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి.
Also Read : Justice Sudarshan Reddy Interesting Letter : తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా : సుదర్శన్ రెడ్డి
