Justice Sudarshan Reddy Interesting Letter : తీర్పును విన‌మ్రంగా స్వీక‌రిస్తున్నా : సుద‌ర్శ‌న్ రెడ్డి

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక తీర్పు ప‌ట్ల లేఖ రాసిన జ‌స్టిస్

Hello Telugu - Justice Sudarshan Reddy Interesting Letter

Hello Telugu - Justice Sudarshan Reddy Interesting Letter

Justice Sudarshan Reddy : హైద‌రాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నిక‌ ఫలితాలపై లేఖ విడుదల చేశారు బ‌రిలో నిలిచి ఓట‌మి పాలైన‌ జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందన్నారు. న్యాయం, ప్రతీ వ్యక్తి గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను కూటమి అభ్యర్ధిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు. బుధ‌వారం జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి (Justice Sudarshan Reddy) మీడియాతో మాట్లాడారు.

Justice Sudarshan Reddy Letter

ప్ర‌జాస్వామ్యం దానికి ఉన్న విలువ ఏమిటో, భార‌త రాజ్యాంగం ప‌ట్ల ఎందుకు విధేయులుగా ఉండాలో అనే విష‌యం ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి తెలియాల‌నే ఉద్దేశంతోనే తాను ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ‌రిలో నిల్చోవాల్సి వ‌చ్చింద‌ని స్పష్టం చేశారు జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి. ఈ ఎన్నిక సంద‌ర్బంగా త‌న‌కు ఓటు వేసిన వారికి, ఓటు వేయ‌కుండా ఉన్న వారికి, త‌ట‌స్తంగా ఉన్న వారికి కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు జ‌స్టిస్.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశ ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్డీయే త‌ర‌పున బ‌రిలో నిలిచిన సీపీ రాధాకృష్ణ‌న్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఇండియా కూట‌మి అభ్యర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డిపై గెలుపొందారు. మొత్తం 781 మంది ఎంపీల‌లో 452 ఓట్లు రాధాకృష్ణ‌న్ కు రాగా సుద‌ర్శ‌న్ రెడ్డికి 300 ఓట్లు ల‌భించాయి. కాగా మొత్తం ఓట్ల‌లో 14 మంది ఎంపీలు ఓటుకు దూరంగా ఉన్నారు. రాధాకృష్ణ‌న్ ఎన్నికైన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

Also Read : VP CP Radhakrishnan Success : ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ విజ‌యం

Exit mobile version