హైదరాబాద్ : హైడ్రా ఏర్పాటైన ఈ రెండేళ్ల కాలంలో 3,325 ఎకరాలను కాపాడడం జరిగిందని తెలిపారు కమిషర్ ఏవీ రంగనాథ్. ఇందుకు సంబంధించి తాము ఏమేం చేశామో పూర్తిగా వివరాలు వెల్లడించారు అధికారికంగా. తాజాగా హైకోర్టు తనను తొలగించాలని ఆదేశించింది. దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఇలాపూర్ గ్రామంలో 816 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించింది. ప్రభుత్వ భూములను బరితెగించి ఆక్రమించుకున్న ఒక సిగ్గులేని వ్యక్తికి (సుప్రీంకోర్టు న్యాయవాదిగా నటిస్తూ మోసం చేసిన వ్యక్తికి) తగిన గుణపాఠం చెప్పి, 40 ఎకరాల ఆక్రమణలను తొలగించింది. అక్కడ ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా కంచెను ఏర్పాటు చేస్తోంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గజుల రామారం గ్రామంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమి ఆక్రమణకు గురవుతున్నప్పుడు హైడ్రా రంగంలోకి దిగి 300 ఎకరాల భూమిని కాపాడింది. ఈ భూమిలో 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి అంతర్-రాష్ట్ర బస్ టెర్మినల్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలలను నిర్మించడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో 40 ఎకరాల భూమిని హైడ్రా పరిరక్షించింది. ULC (అదనపు భూ గరిష్ట పరిమితి చట్టం) పరిధిలోని భూములపై హక్కులు ఉన్నాయని వాదించిన వారిని తొలగించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్‌తో పాటు కళాశాలలు ,హాస్టళ్లను నిర్మిస్తోంది.
అనేక లేఅవుట్‌లను కలిపి, ‘దివ్యనగర్’ పేరుతో ఒక లేఅవుట్‌గా మార్చి అక్కడ ప్లాట్లను విక్రయించే ప్రయత్నం చేశార. ఆ ప్లాట్‌కు యజమాని కావాలంటే నల్ల మల్లారెడ్డికి తలవంచాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఆ ప్లాట్లకు వెళ్లే దారిని అడ్డుకున్న వారికి హైడ్రా తగిన గుణపాఠం చెప్పింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ మున్సిపాలిటీలో, సుమారు 200 ఎకరాల భూమి చుట్టూ కంచె వేసి, చుట్టుపక్కల కాలనీలకు వెళ్లే దారులను మూసివేసిన వారిపైచర్యలు చేపట్టింది. ఆ కంచెలను తొలగించి, కాలనీలకు వెళ్లే మార్గాలను పునరుద్ధరించింది.
