PM Kisan : రైతుల ఆర్థిక భద్రతను లక్ష్యంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6,000 నగదు సహాయం అందించబడుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది.
PM Kisan Key Update
ఇప్పటి వరకు 19 విడతలు విడుదల కాగా, ప్రస్తుతం 20వ విడత విడుదలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం ఈ విడత డబ్బులను వచ్చే ఆగస్టులో విడుదల చేసే అవకాశముందని సమాచారం. అధికారికంగా విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఈ విడత విడుదలయ్యే అవకాశముందని వార్తలు వెల్లడి చేస్తున్నాయి.
PM Kisan – ఎవరు అర్హులు? ఎవరు కాదు?
ఈ పథకం ప్రయోజనం అందరికీ అందుబాటులో ఉండదు. పథకం ద్వారా ప్రయోజనం పొందే అర్హత కలిగిన వారు మాత్రమే డబ్బులు పొందగలరు. అర్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
అర్హులేమి వలన తప్పుకునే వారు:
- ప్రభుత్వ ఉద్యోగులు
- నెలకు రూ.10,000 కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు
- డాక్టర్లు, ఇంజనీర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు (CAs)
- ఆధార్‌తో లింక్ కాని బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు
- e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది రైతులకు ఆర్థిక ఉపశమనం లభించింది. ఈ పథకం కింద తాజా విడత (20వ విడత) వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో జమ కావచ్చన్న ఆశతో, పథకానికి అర్హులైన వారు e-KYC మరియు బ్యాంక్ లింకింగ్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు:
- తప్పనిసరిగా ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా అవసరం
- e-KYC పూర్తయిన వారికే డబ్బులు జమ అవుతాయి
- ఫేక్ సమాచారం ఇస్తే, ప్రభుత్వ సబ్సిడీ రద్దు అవుతుంది
రాబోయే రోజుల్లో పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం రైతులు అధికారిక వెబ్‌సైట్ **pmkisan.gov.in**ను పరిశీలించవచ్చు.
Also Read : KTR Sensational Announcement : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు టికెట్లు


















