ముంబై : రణబీర్ కపూర్ , యశ్ , సాయి పల్లవి ముఖ్య పాత్రలు పోషించిన చరిత్రాత్మక చిత్రం రామాయణం పై కీలక అప్ డేట్ వచ్చింది. శనివారం అధికారికంగా సామాజిక వేదికగా సినిమా ట్రైలర్ ను జూలై 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. దీంతో అటు రణ బీర్ ఇటు యశ్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదుచు చూస్తున్నారు. ఇప్పటికే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న టాక్సిక్ చర్చకు దారి తీసింది. హాలీవుడ్ రేంజ్ లో దీనిని తీసింది. ఇప్పటికే మార్కెట్ పరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. ఈ తరుణంలో యశ్ కీ రోల్ పోషించిన మరో మూవీ కూడా ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక రామాయణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మూవీ మేకర్స్. భారతీయ చలనచిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయి (స్కేల్)లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణం’ చిత్రం గురించిన అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. ఇటీవలి కాలంలో అత్యంత భారీ భారతీయ చిత్ర ప్రాజెక్టులలో ఒకటైన ‘రామాయణం’ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించారు. ధర్మం, మర్యాద, ధైర్యం , కరుణ వంటి శాశ్వతమైన ఆదర్శాల ద్వారా వేల సంవత్సరాలుగా తరాలను ప్రభావితం చేసిన భారతీయ గొప్ప ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోందని వారు పేర్కొన్నారు.



















