PM Kisan Interesting Update : ఎట్టకేలకు పీఎం కిసాన్ పై కీలక అప్డేట్ ఇచ్చిన కేంద్ర సర్కార్

మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది...

Hello Telugu - PM Kisan Interesting Update

Hello Telugu - PM Kisan Interesting Update

PM Kisan : రైతుల ఆర్థిక భద్రతను లక్ష్యంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్ర‌ధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6,000 నగదు సహాయం అందించబడుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది.

PM Kisan Key Update

ఇప్పటి వరకు 19 విడతలు విడుదల కాగా, ప్రస్తుతం 20వ విడత విడుదలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం ఈ విడత డబ్బులను వచ్చే ఆగస్టులో విడుదల చేసే అవకాశముందని సమాచారం. అధికారికంగా విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఈ విడత విడుదలయ్యే అవకాశముందని వార్తలు వెల్లడి చేస్తున్నాయి.

PM Kisan – ఎవరు అర్హులు? ఎవరు కాదు?

ఈ పథకం ప్రయోజనం అందరికీ అందుబాటులో ఉండదు. పథకం ద్వారా ప్రయోజనం పొందే అర్హత కలిగిన వారు మాత్రమే డబ్బులు పొందగలరు. అర్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

అర్హులేమి వలన తప్పుకునే వారు:

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది రైతులకు ఆర్థిక ఉపశమనం లభించింది. ఈ పథకం కింద తాజా విడత (20వ విడత) వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో జమ కావచ్చన్న ఆశతో, పథకానికి అర్హులైన వారు e-KYC మరియు బ్యాంక్ లింకింగ్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు:

రాబోయే రోజుల్లో పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం రైతులు అధికారిక వెబ్‌సైట్ **pmkisan.gov.in**‌ను పరిశీలించవచ్చు.

Also Read : KTR Sensational Announcement : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు టికెట్లు

Exit mobile version