Piyush Goyal-Mobile Production Growth : భారత్ లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తులు గతం కంటే 146 శాతం పెరుగుదల

పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ మంగళవారం పార్లమెంటులో లిఖితపూర్వకంగా వెల్లడించారు...

Hello Telugu - Piyush Goyal-Mobile Phone Production Growth

Hello Telugu - Piyush Goyal-Mobile Phone Production Growth

Piyush Goyal : భారతదేశంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగం బలంగా ఎదుగుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 నాటికి మొబైల్ ఉత్పత్తి విలువలో దాదాపు 146 శాతం పెరుగుదల నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ (Piyush Goyal) మంగళవారం పార్లమెంటులో లిఖితపూర్వకంగా వెల్లడించారు.

Union Minister Piyush Goyal Key Comments on Mobile Production Growth

అదే విధంగా, మొబైల్ ఫోన్ల ఎగుమతులు విలువ పరంగా 775 శాతం పెరిగి, రూ.22,870 కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణనీయమైన పురోగతికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పాదకత సంబంధిత ప్రోత్సాహక పథకం (PLI), జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమాలు ముఖ్య కారణాలని మంత్రి పేర్కొన్నారు.

ఉత్పత్తి, ఉపాధికి పునాదులు వేసిన పథకాలు:

PLI స్కీమ్ ద్వారా భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులపై ఆధారపడి కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఈ విధంగా స్థానికంగా తయారీ యూనిట్ల స్థాపన, విస్తరణ, ఉపాధి సృష్టి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టామన్నారు.

ఈ చర్యల ద్వారా భారత్, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. అంతేకాదు, ఫార్మా రంగంలోనూ ఇదే విధమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. పెన్సిలిన్-జి వంటి ముడి పదార్థాలు దేశీయంగా ఉత్పత్తి అవుతూ దిగుమతులపై ఆధారం తగ్గించడంలో ఇదంతా ఉపయోగపడిందన్నారు.

వైద్య పరికరాల్లోనూ పురోగతి:

CT స్కాన్, MRI వంటి ఆధునిక వైద్య పరికరాల తయారీలోనూ భారత్ సాంకేతికంగా మెరుగవుతోందని, ఫలితంగా ఆరోగ్యరంగం లో స్వావలంబన కాస్తా బలోపేతమవుతోందని వివరించారు.

వైట్ గూడ్స్‌కు PLI ప్రయోజనాలు:

ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడి లైట్లు వంటి వైట్ గూడ్స్ పరిశ్రమలకు సంబంధించి, దేశీయ కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా PLI పథకం పనిచేస్తోందన్నారు. దీని ద్వారా భారత్‌ను ప్రపంచ సరఫరా గొలుసులో భాగంగా మార్చే లక్ష్యం వుందని చెప్పారు.

మేక్ ఇన్ ఇండియా 2.0 – 27 కీలక రంగాలపై దృష్టి:

ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించి, 27 రంగాల్లో రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో తయారీ పెట్టుబడుల ఆహ్వానంపై దృష్టి సారించిందన్నారు.

పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి:

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NICDC) కింద రూ.28,602 కోట్ల విలువైన 12 కొత్త ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయని చెప్పారు. అదనంగా, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్, ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, సింగిల్ విండో సిస్టమ్ వంటి పథకాల ద్వారా పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి పియూష్ గోయల్ వివరించారు.

Also Read : India-UK Free Trade Agreement : త్వరలో భారత్-యునైటెడ్ కింగ్డమ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

Exit mobile version