India-UK Free Trade Agreement : త్వరలో భారత్-యునైటెడ్ కింగ్డమ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

జూలై 25న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేయనున్నట్టు సమాచారం...

Hello Telugu - India-UK Free Trade Agreement

Hello Telugu - India-UK Free Trade Agreement

India-UK Free Trade : భారతదేశం – యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల మధ్య ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) తుదిదశకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా జూలై 25న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేయనున్నట్టు సమాచారం.

India-UK Free Trade Agreement Updates

ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని రూపుదిద్దారు. ఫలితంగా, వివిధ రంగాల్లో పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి అవకాశాల్లో గణనీయమైన వృద్ధి కనిపించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పెట్టుబడుల పరస్పర ప్రవాహం:

ప్రస్తుతం యూకేలో వెయ్యికి పైగా భారతీయ (India) కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో లక్షమందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. భారతీయ సంస్థలు యూకేలో ఇప్పటివరకు రూ.1.73 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టగా, యూకే పారిశ్రామికవేత్తలు భారత్‌లో రూ.3.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూకే, భారత్‌లో ఆరవ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచింది.

ఒప్పందం అమలుకు విధినిర్ధారణ:

ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కి బ్రిటిష్ పార్లమెంట్, భారత కేంద్ర మంత్రిమండలి నుంచి చట్టపరమైన ఆమోదం లభించిన తర్వాత, ఒక సంవత్సర కాల వ్యవధిలో అమలులోకి రానుంది.

ఒప్పందం ద్వారా భారత్‌కు లభించే కీలక ప్రయోజనాలు:

స్కాచ్ విస్కీ, జిన్ వంటి ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 150 శాతం దిగుమతి సుంకం ఈ ఒప్పందం ద్వారా 75 శాతానికి తగ్గనుంది. భవిష్యత్తులో దాన్ని 40 శాతం వరకు తగ్గించే అవకాశం.

యూకే ఉత్పత్తి చేసిన కార్లపై ప్రస్తుతం ఉన్న 100 శాతం దిగుమతి పన్ను, ఒప్పందం అమలుతో 10 శాతానికి పడిపోయే అవకాశం.

సౌందర్య సాధనాలు, సాల్మన్ చేపలు, చాక్లెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలపై కూడా పన్ను రాయితీలు ఇవ్వనుంది భారత్.

ఒప్పందం ద్వారా యూకేకు లభించే ప్రయోజనాలు:

భారత్ నుంచి యూకేకు ఎగుమతయ్యే దాదాపు 99 శాతం ఉత్పత్తులపై పూర్తిస్థాయి పన్ను మినహాయింపు లభించనుంది.

ప్రస్తుతం యూకే విధిస్తున్న 16 శాతం వరకూ పన్ను: వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచర్, రసాయనాలు, యంత్ర పరికరాలపై వర్తిస్తుంది. ఈ పన్నులు ఇకపై మినహాయించనున్నారు.

ప్రధాన లాభదారులు:

ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత భారత టెక్స్‌టైల్, ఫుట్‌వేర్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలకు భారీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉత్పత్తుల ఎగుమతులు పెరగడంతోపాటు, పరిశ్రమలు ప్రపంచ విపణిలో మరింత పోటీ సామర్థ్యం పొందనున్నాయి.

Also Read : Stock Market Growth : అమెరికా జపాన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్..లాభాల బాటలో స్టాక్ మార్కెట్

Exit mobile version