Piyush Goyal : ఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. భారత్ పై సుంకాల పేరుతో రెచ్చి పోతున్న సమయంలో అప్ డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గోయల్ (Piyush Goyal) కేంద్ర మంత్రి మాట్లాడారు. వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం మొదటి దశ పూర్తవుతుందని , ఆ నమ్మకం తమకు ఉందన్నారు. అంతకు ముందు ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక పోస్ట్‌లో భారతదేశంపై విధించిన సుంకాలపై టగ్ ఆఫ్ వార్‌లో కొంత తగ్గుదల ఉందని సూచించారు.
Union Minister Piyush Goyal Key Comments
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురువారం పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మొదటి దశను నవంబర్ నాటికి ఖరారు చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి రెండు వైపులా చర్చలు జరిపారు. వీరు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మంత్రి. నవంబర్ నెలాఖరు వరకు ఇరు దేశాలు వాణిజ్య పరంగా ఒప్పందం చేసుకోవాలని తమకు సూచించారని చెప్పారు పీయూష్ గోయల్.
ఈ అంశంపై చర్చలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పారు. తమ చర్చలలో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. ప్రధానంగా రెండు దేశాలు వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే వారాల్లో నా స్నేహితుడు ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడటానికి నేను ఎదురు చూస్తున్నానని ఈ సందర్బంగా ట్రంప్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు కేంద్ర మంత్రి.
Also Read : Shamshabad Airport – Strong Recognization : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు
