Shamshabad Airport – Strong Recognization : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు

ప్ర‌యాణీకుల సేవ‌లో లెవ‌ల్ - 4 ప్ర‌ద‌ర్శ‌న

Hello Telugu - Shamshabad Airport - Strong Recognization

Hello Telugu - Shamshabad Airport - Strong Recognization

Shamshabad Airport : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ప్ర‌తిరోజూ వివ‌ధ దేశాల‌కు, ప్రాంతాల‌కు పెద్ద ఎత్తున విమానాలు ప్ర‌యాణీకుల‌ను చేర వేస్తుంటాయి. కాగా ప్రయాణీకుల సేవలో అత్యుత్తమ ప్రదర్శనకు లెవల్-4 గుర్తింపు ల‌భించింది. వరల్డ్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ విమానాశ్రయాలను సర్వీస్ డెలివరీ, కార్యాచరణ సామర్థ్యం , ప్రయాణీకుల సంతృప్తిపై స‌ర్వే చేస్తుంది. ప్ర‌స్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) గ్రంథి మ‌ల్లికార్జున రావు నేతృత్వంలోని క‌న్సార్టియం – జీఎంఆర్ ప్ర‌త్యేకంగా నిలిచింది. ఇండియాలో టాప్ ఎయిర్ పోర్టుగా గుర్తింపు పొందింది.

Shamshabad Airport Good Recognization

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్‌లో లెవల్-4 గుర్తింపును పొందిన‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రయాణీకుల సేవలో అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపు పొందిన గ్లోబల్ విమానాశ్రయాల లీగ్‌లో చేరింది. ఈ గుర్తింపు నాలుగు స్తంభాలపై విమానాశ్రయం కస్టమర్-ఫస్ట్ దృష్టిని హైలైట్ చేసింది. అన్ని స్థాయిల కార్యకలాపాలలో కస్టమర్ కేంద్రీకృత‌ సంస్కృతి, అధునాతన ప్రయాణీకుల అభిప్రాయ విధానాలు, డేటా-ఆధారిత సేవా మెరుగుదలలు, సజావుగా ప్రయాణ అనుభవాలను నిర్ధారించడానికి వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది.

లెవల్ 4 అక్రిడిటేషన్ సాధించడం అనేది ప్రయాణీకులను త‌మ‌ కార్యకలాపాలలో ప్రధానంగా ఉంచడంలో అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం అని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్ర‌దీప్ ప‌నిక‌ర్ అన్నారు. ప్రయాణ అనుభవాన్ని మెరుగు పరచడానికి తాము చేసిన వ్యూహాత్మక పెట్టుబడులను ఇది పునరుద్ఘాటిస్తుందన్నారు.

Also Read : TGPWU Chief Shocking – Files Petition : టాక్సీ ఛార్జీల నియంత్ర‌ణ లేక పోవ‌డంపై పిటిష‌న్

Exit mobile version