Piyush Goyal : ఖతార్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే భారత దేశంలో డిజిటల్ కరెన్సీ ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన క్రిప్టో కరెన్సీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా కరెన్సీ వస్తోందని, కానీ తమ ప్రభుత్వం వాటిని గుర్తించడం లేదన్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి కరెన్సీని ఆమోదించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు గోయల్. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి ఖతార్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ , ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ , ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ షేక్ బందర్ బిన్ మొహమ్మద్ బిన్ సౌద్ అల్-థానీని దోహాలో కలిశారు. ఈ సందర్బంగా ఈ ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు కొనసాగాయి.
Union Minister Piyush Goyal Key Update
భారతదేశం, ఖతార్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచు కోవడానికి చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ దేశంలో కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను డబ్బుల లావాదేవీల విషయంలో అప్రమత్తం చేస్తూ వస్తోందని చెప్పారు. ఇవాళ యూపీఐ లావాదేవీలలో ప్రపంచంలోనే టాప్ లో భారత దేశం కొనసాగుతోందన్నారు. ప్రతి రోజూ జరిగే వ్యవహారాలకు సంబంధించి మరింత సరళతరం చేసేందుకు తమ సర్కార్ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు గోయల్. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ లాంటి కరెన్సీ మద్దతుతో డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిందన్నారు. దీని వల్ల లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
Also Read : India Strong Warning to Pakistan : పాకిస్తాన్ జర జాగ్రత్త ఇండియా వార్నింగ్
