India Strong Warning to Pakistan : పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త ఇండియా వార్నింగ్

తన సొంత ప్రజలపై బాంబులు వేసింది

Hello Telugu - India Strong Warning to Pakistan

Hello Telugu - India Strong Warning to Pakistan

India : అమెరికా : ఐక్య‌రాజ్య స‌మితి వేదిక‌గా దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భార‌త్. త‌మ దేశాన్ని స‌ర్వ నాశ‌నం చేస్తామంటూ పాకిస్తాన్ దేశ రక్ష‌ణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ చేసిన కామెంట్స్ పై భార‌త దేశ ప్ర‌తినిధి ప‌ర్వ‌త‌నేని హ‌రీష్ స‌ర్వ స‌భ్య స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ 1971 ఆపరేషన్ సెర్చ్ లైట్ ను హైలైట్ చేశారు. దీనిలో పాకిస్తాన్ సైన్యం 4, 00,000 మంది మహిళలపై సామూహిక అత్యాచారం జ‌రిపింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. గ‌త కొంత కాలంగా పాకిస్తాన్ త‌న దుర్బుద్దిని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి భార‌త దేశంపై ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా భార‌త్ బుద్ది చెప్పినా ఇంకా త‌న బుద్ది మార్చు కోవ‌డం లేద‌న్నారు హ‌రీశ్ ప‌ర్వ‌తనేని.

India Strong Warning to Pakistan in UN Meeting

ఈ కీల‌క స‌మావేశంలో మ‌హిళ‌లు, శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇందులో పాల్గొన్నారు భారదేశ శాశ్వ‌త ప్రతినిధి హ‌రీశ్ ప‌ర్వ‌త‌నేని (Harish Parvathaneni). పాకిస్తాన్ ను ఏకి పారేశారు. త‌ను చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టారు. గీత దాటితే బాగుండ‌ద‌ని, త‌న ప‌రిమితిలో ఉంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. అబ‌ద్దాల‌ను ఆధారంగా చేసుకుని పాల‌న సాగిస్తున్న పాకిస్తాన్ కు అంత సీన్ లేద‌న్నారు. ఉగ్ర‌వాదానికి ఊతం ఇస్తూ, టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేస్తున్న ఆ దేశానికి భార‌త దేశం గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు హ‌రీష్ పర్వ‌త‌నేని. విచిత్రం ఏమిటంటే తన సొంత ప్రజలపై బాంబులు వేసి, క్రమబద్ధమైన మారణహోమం నిర్వహించే దేశం ప్రపంచాన్ని తప్పుడు దిశానిర్దేశం, అతిశయోక్తితో దృష్టి మరల్చడానికి మాత్రమే ప్రయత్నించగలదంటూ మండిప‌డ్డారు.

Also Read : PM Modi Strong Response : సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడి దారుణం : మోదీ

Exit mobile version