Droupadi Murmu : ఢిల్లీ – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కీలక ప్రకటన చేశారు. విశిష్ట సేవలు అందించిన నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్దన్ శ్రింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ , కేరళకు చెందిన సామాజికవేత్త సదానంద్ మాస్టర్ ను పెద్దల సభకు ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. అయితే భారత రాష్ట్రపతికి విశిష్టమైన అధికారాలు ఉంటాయి. మొత్తం తన వరకు 12 మందిని పెద్దల సభకు పంపించేందుకు అధికారం ఉంటుంది. ఇందులో ప్రత్యేకించి సాహిత్యం, కళలు, సామాజిక సేవ, తదితర రంగాలను పరిగణలోకి తీసుకుంటారు. వారు చేసిన సేవలను పరిశీలించిన తర్వాత నామినేట్ చేస్తారు రాష్ట్రపతి.
Droupadi Murmu Appionts
ఇక తాజాగా ఎంపికైన వారిలో ఎవరికి వారే ప్రత్యేకత కలిగి ఉన్నారు. న్యాయ రంగంలో ఉజ్వల్ నికం గురించి ఎంత చెప్పినా తక్కువే. పేరు పొందిన న్యాయవాదులలో ఒకడిగా ఉన్నారు. ముంబయి ఉగ్రదాడుల కేసును విచారించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు. బాంబు పేలుళ్ల కేసును కూడా వాదించారు. దోషులకు శిక్ష పడేలా చేశారు.
మాజీ దౌత్యవేత్త అయిన శ్రింగ్లా కు అపారమైన అనుభవం ఉంది. అమెరికా, థాయిలాండ్, బంగ్లాదేశ్ దేశాలలో భారత దేశం తరపున రాయబారిగా పని చేశారు. సీనియర్ దౌత్యవేత్తగా గు్ర్తింపు పొందారు. అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంలో అపారమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత దేశం వాయిస్ ను తనదైన శైలిలో వినిపించే ప్రయత్నం చేశారు.
రాజ్యసభకు నామినేట్ అయిన మరొకరు సి. సదానందన్ మాస్టర్. కేరళ ఆయన స్వస్థలం. టీచర్ గా పని చేశారు. సామాజిక కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ నాయకుడిగా సేవలు అందిస్తున్నారు. 1994లో సీపీఎం నేతల దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయారు.
మరొకరు మీనాక్షి జైన్. తను చరిత్రకారణిగా పేరు పొందారు. విద్యా పరంగా సేవలు అందించారు. ఆమె చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. భారతీయ సంస్కృతి, సామాజిక అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు.
Also Read : Minister Uttam Kumar Reddy Interesting : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం
