కేరళ : ప్రముఖ మలయాళ నటి అన్సిబా హసన్ కు భారీ ఊరట లభించింది. నటి లక్ష్మీ ప్రియ, మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడానికి నిరాకరించింది దిగువ కోర్టు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ నటి అన్సిబా హసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉండగా నిందితులు తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి , తన పరువుకు భంగం కలిగించడానికి అభ్యంతరకరమైన , లైంగిక రంగు పులిమిన ఇంటర్వ్యూ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్సిబా హసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఈ విషయం గుర్తించదగిన నేరం కాదని, కేవలం క్రిమినల్ పరువు నష్టం కిందకు వస్తుందని పేర్కొంటూ, ఎర్నాకుళంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గతంలో ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, కేరళ పోలీస్ చట్టం కింద నిబంధనలను ప్రస్తావిస్తుందని పేర్కొంటూ నటి అన్సిబా మసన్ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసింది. ఈమేరకు కేరళ లో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించింది. తను చేసిన దావాను విచారించేందుకు ఇవాళ కోర్టు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక అన్సిబా హుస్సేన్ విషయానికి వస్తే భారతీయ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత (యాంకర్), మోడల్ , నర్తకి. ఆమె ప్రధానంగా మలయాళ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. 2013లో విడుదలైన దృశ్యం సినిమాలో మోహన్‌లాల్ కుమార్తె అంజు జార్జ్ పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. జూన్ 18, 1992లో కేరళ లోని కోజికోడ్ లో పుట్టారు. 2013 లో చిత్ర రంగంలోకి ఎంటర్ అయ్యారు. పలు మలయాళ సినిమాలలో నటిగా పని చేశారు. తమిళ చిత్రం గీతికలో కూడా నటించారు అనిబా హసన్. 2024లో ప్రసారమైన బిగ్ బాస్ మలయాళం సెషన్ -6ల పాల్గొన్నారు. 77 రోజులు హౌస్ లో ఉంటూ ఆదరణ పొందారు. 2025లో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగగా ఎన్నికయ్యారు.
