ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర‌న్నకు మ‌ర‌ణం లేదు

ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

hellotelugu-GaddarAwards

హైద‌రాబాద్ : ఈ లోకంలో సూర్య‌చంద్రులు ఉన్నంత కాలం ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర‌న్న బ‌తికే ఉంటార‌ని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో గ‌ద్ద‌ర‌న్న సినీ అవార్డుల కార్య‌క్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎంతో పాటు సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణుల‌తో పాటు వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా హాజ‌ర్యారు. విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఈ సంద‌ర‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది ప్రతి ఏటా గద్దరన్న యాదిలో జరుపుకునే వేడక అని అన్నారు. ఇది ప్రజా పోరులో నాకు స్ఫూర్తినిచ్చిన యుద్ధనౌక స్మృతికి కానుక అని పేర్కొన్నారు .

సమాజాన్ని తన గళంతో రగిలించిన గొప్ప కళా వీరుడు గద్దరన్న అని కొనియాడారు రేవంత్ రెడ్డి. ఆయన పేరుతో సిని కళాకారులకు ప్రతి ఏటా “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్” ప్రదానం చేయడం గొప్ప అనుభూతి ఇస్తోంద‌న్నారు. ఆయనకు ఇది మనంద‌రం ఇచ్చే అరుదైన‌ నివాళి అని అన్నారు. హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుకలో పాల్గొనడం మ‌రింత సంతోషం క‌లిగించింద‌ని చెప్పారు. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియ చేస్తున్నాన్నారు.

Exit mobile version