Gold Shops – Huge Crowd : ధన త్రయోదశికి బంగారం షాపుల వద్ద బారులు తీరిన జనం

శుభప్రదమని నమ్మకం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆభరణాల దుకాణాలకు తరలివెళ్తున్నారు.

Hello Telugu - Gold Shops - Huge Crowd

Hello Telugu - Gold Shops - Huge Crowd

Gold : ధన త్రయోదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గోల్డ్‌ షాపులు సందడితో కళకళలాడుతున్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ రోజున బంగారం (Gold), వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్మకం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆభరణాల దుకాణాలకు తరలివెళ్తున్నారు.

Gold Shops Today Crowd Sensational

తెలంగాణలో బీసీ బంద్‌ కారణంగా ఉదయం మూడు గంటల వరకు మూసివేసిన షాపులు తిరిగి తెరుచుకోవడంతో నగరంలో గోల్డ్‌ షాపుల వద్ద క్యూ లైన్లు కనిపించాయి. మహిళలు, యువతీ యువకులు ధన త్రయోదశి సెంటిమెంట్‌తో బంగారం (Gold), వెండి కొనుగోలులో ఆసక్తి చూపుతున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉదయం నుంచే గోల్డ్‌ షాపులు రద్దీగా మారాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో ప్రజలు షాపుల వద్ద క్యూలు కడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలో కూడా ధన త్రయోదశి (దంతేరస్‌) సందర్భంగా బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు ఈ సీజన్‌లో సేల్స్‌ ఐదు రోజుల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

బంగారం ధరల్లో ఊహించని మార్పు

పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న ధరలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. అయితే ధన త్రయోదశి రోజున కొంత ఉపశమనం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై సుంకాలపై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,180 తగ్గి రూ.1,32,000 వద్దకు వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,230గా ఉంది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.1,79,600గా నమోదైంది.

వ్యాపారులకు ఉత్సాహం, వినియోగదారులకు సంతోషం

ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. నగరంలోని ప్రముఖ గోల్డ్‌ షాపులు సాయంత్రం వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి. వ్యాపారులు ఈ సీజన్‌ అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Also Read : Mukesh Ambani Growth : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్యూ2 ఫలితాలు: నికర లాభం రూ.18,165 కోట్లు

Exit mobile version