చెన్నై : సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు మేలు చేకూర్చేలా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు సీఎం. ఈ మేరకు ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీల ఏర్పాటుకు సానుకూలంగా వ్యవహరిస్తామని ఈ సందర్బంగా తెలిపింది సర్కార్. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపే అనుమతులు మంజూరు చేస్తామని సంచలన ప్రకటన చేశారు విజయ్ . కాలపరిమితితో కూడిన, జవాబుదారీతనం గల , పెట్టుబడి-ఆధారిత పాలన దిశగా ఒక సాహసోపేతమైన మార్పును సూచిస్తుంది.
తమిళనాడు వ్యాపార సౌలభ్య (సవరణ) చట్టం- 2026 ప్రతిపాదిత తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక కమిషన్ మద్దతుతో ఈ సంస్కరణ డీమ్డ్ అప్రూవల్స్, శాఖల మధ్య సమన్వయం , పరిపాలనా పరమైన చర్యల లోపానికి జరిమానాల ద్వారా అధికార యంత్రాంగంలోని అడ్డంకులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుబంధ చర్యలు లైసెన్సింగ్, భూ మార్పిడి, ఎంఎస్ఎంఈ కేటాయింపులు , పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను సులభతరం చేస్తాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ హబ్‌లు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు , ఎగుమతి ఆశయాలు రాష్ట్ర ఆర్థిక వ్యూహాన్ని మరింత బలోపేతం అవుతాయని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి ఎస్. కీర్తన కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అయిత వేగవంతమైన అనుమతులు పర్యావరణ పరిరక్షణ, చట్టబద్ధమైన నిబంధనల పాటింపు , ప్రజా భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పెట్టుబడి నిబద్ధతలను కార్యాచరణ పరిశ్రమలుగా, ఉపాధిగా, ఎగుమతులుగా మార్చడంలోనే అసలైన పరీక్ష ఉంది.
