సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో రెనాల్ట్ గ్రూప్ భేటీ

త‌మిళ‌నాడులో భారీగా పెట్టుబడులపై ఫోక‌స్

hellotelugu-CMVijay

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి తిరు సి. జోసెఫ్ విజయ్ చంద్ర‌శేఖ‌ర్ ను గురువారం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ గ్రూప్ (Renault Group) ప్రతినిధి బృందం సచివాలయంలో కలిసింది. ఈ బృందంలో రెనాల్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాంకోయిస్ ప్రవోస్ట్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫాబ్రిస్ కాంబోలివ్, రెనాల్ట్ గ్రూప్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ డెబ్లైస్, కమ్యూనికేషన్స్, మీడియా రిలేషన్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విభాగం ఉపాధ్యక్షురాలు హంసా ధీర్, కార్పొరేట్ అఫైర్స్ జనరల్ మేనేజర్ నరసింహన్ పురుషోత్తమన్ ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా తమిళనాడులో రెనాల్ట్ గ్రూప్ తన పెట్టుబడులను మరింతగా పెంచు కోవాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇందు కోసం తమిళనాడు ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం లభిస్తుందని ఆయన ఆ ప్రతినిధి బృందానికి భరోసా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు . ప్ర‌ధానంగా త‌మ టీవీకే స‌ర్కార్ అధికారంలోకి కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేకించి ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావ‌ర‌ణం ఏర్పాటు చేశామ‌న్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు తిరు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. పెట్టుబ‌డిదారుల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కంపెనీల‌కు స్వ‌ర్గ‌ధామం త‌మిళ‌నాడు రాష్ట్రం అని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version