Pawan Kalyan New Innovation for Panchayat : పంచాయతీ పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు

10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు

Hello Telugu - Pawan Kalyan New Innovation for Panchayat

Hello Telugu - Pawan Kalyan New Innovation for Panchayat

Pawan Kalyan : అమ‌రావ‌తి : ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ తెలిపింది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం కచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. రూర్బన్ పంచాయతీలు గుర్తించిన వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.

Pawan Kalyan Key Update

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు తీసుకు వ‌చ్చామ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకం అన్నారు. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని, మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి స్పందించారు. వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Also Read : Konda Sushmita Shocking Comments : సీఎం, మంత్రుల‌పై కొండా సుష్మిత షాకింగ్ కామెంట్స్

Exit mobile version