Konda Sushmita : వరంగల్ జిల్లా : ఓరుగల్లు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె ఓఎస్డీని ప్రభుత్వం తొలగించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సురేఖ కూతురు సుష్మితా పటేల్ (Konda Sushmita). ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డిలు కలిసి తమ తల్లి, దండ్రులు కొండా సురేఖ, కొండా మురళిలను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు తెర లేపారంటూ మండిపడ్డారు. తమ జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. మా నాన్న కొండా మురళిని అరెస్ట్ చేసి, మా అమ్మను మంత్రి పదవి నుండి పీకేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు సుష్మితా పటేల్.
Konda Sushmita Slams
ఈ ప్రభుత్వంలో రెడ్లు అంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని, ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించాడని అన్నారు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి, మా అమ్మ నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మా అమ్మ నాన్న మీదకు వస్తే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంగతి ఏమిటో చెబుతానన్నారు. అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులను మా ఇంటికి పంపి మా అమ్మను అరెస్ట్ చేసి, మా మీద మర్డర్ అటెంప్ట్ చేద్దామని చూశారన్నారు . రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి గన్ మెన్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. మా కుటుంబానికి ఏం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : CM Chandrababu – Google Vizag Interesting : చంద్రబాబు గూగుల్ వైజాగ్ పోస్టర్ వైరల్
