Pawan Kalyan : కర్నూలు జిల్లా : పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలు ఉండవన్నారు. పీఎం మోదీ తీసుకు వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుందని చెప్పారు. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టిన మోదీ కృషితో దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు.
AP Deputy CM Pawan Kalyan Key Comments
గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని తెలిపారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధాని అని అభివర్ణించారు పవన్ కళ్యాణ్. ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్న ప్రధాని లాంటి వ్యక్తి ఉండడం దేశం చేసుకున్న పుణ్యం అన్నారు. రెండు తరాలను ముందుకు నడుపు తున్నారు. భావి తరానికి మార్గదర్శనం చేస్తున్నారు. దేశం తలెత్తుకొనేలా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకు వచ్చారు. మేము సేవకులం మాత్రమే కాదు అవసరం అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని చాటి చెప్పారు. భారత్ అగ్రగామి అని, ఎవరికీ భయపడే దేశం కాదని చేతల ద్వారా తెలియ ఘనత ఒక్క మోదీకే దక్కుతుందన్నారు.
Also Read : MLC Nagababu Challenge : శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ అభివృద్దికి కృషి చేస్తా
