MLC Nagababu Challenge : శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ అభివృద్దికి కృషి చేస్తా

ప‌రిశీలించిన జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ నాగ‌బాబు

Hello Telugu - MLC Nagababu Challenge

Hello Telugu - MLC Nagababu Challenge

MLC Nagababu : చిత్తూరు జిల్లా : శ్రీ‌కాకుళం ఆర్టీసీ బ‌స్టాండ్ అభివృద్దికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు జ‌న‌సేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు (MLC Nagababu). ఆయ‌న‌ శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘ కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు, జనసేన పార్టీ స్థానిక నాయకులు  నాగబాబు దృష్టికి తీసుకు వ‌చ్చారు. దీంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్ తో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. నిత్యం దాదాపుగా 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి సాధ్యం అయ్యే అవకాశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

MLC Nagababu Challenge

ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ ఫాంలను 40కు పెంచి ఇంటీగ్రేటెడ్ బస్టాండ్ నిర్మిస్తే ప్రయాణికులకు అనుకూలంగానూ, ఆదాయ వనరుగా కూడా ఉపయోగ పడుతుందని అధికారులు ఎమ్మెల్సీ కె. నాగబాబుకు వివరించారు. లిఫ్టింగ్ పద్ధతిలో వరద నీటిని తోడి డ్రైనేజీలకు పంపే విధానం గురించి శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్ వివరించారు. నగరానికి దగ్గరగా నూతన బస్టాండ్ నిర్మాణం కూడా ఒక మార్గంగా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్ ప్రస్తావించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు మాకూ ఉన్నాయని, బస్సుల్లో తిరిగిన వాళ్ళం కనుక ప్రయాణీకుల సమస్యలు తెలుసని, సాధ్యం అయినంత తొందరలో శ్రీకాకుళం బస్టాండ్ ద్వారా రాకపోకలు సాగించే వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని స్ప‌ష్టం చేశారు. తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Also Read : Congress Govt Important Update : వానాకాలం సీజ‌న్ లో ధాన్యం కొనుగోళ్లు

Exit mobile version