TTD Pavitrotsavam Interesting : 19 నుంచి శ్రీ‌వారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు

21వ తేదీ వ‌ర‌కు అమ‌రావ‌తి గుడిలో టీటీడీ ఏర్పాట్లు

Hello Telugu - TTD Pavitrotsavam Interesting

Hello Telugu - TTD Pavitrotsavam Interesting

Pavitrotsavam : తిరుప‌తి – అమరావతి లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆగష్టు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మహా నగరం అమరావతి ( వేంకటపాలెం)లో టిటిడిచే (TTD) నిర్మించిన, కొలువుతీరి వేంచేసి ఉన్న‌ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుందు ప్రప్రథమంగా లోక కల్యాణార్థం, సర్వలోకహితార్థం శ్రీ వేఖానస భగవచ్ఛాస్త్రరీత్యా పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

TTD Pavitrotsavam Updates

ఆగష్టు 18వ తేదీ సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణం జరుగనుంది. ఉదయం విశ్వక్సే నారాధన, పుణ్యాహ వాచనం, ఆచార్య ఋత్విక్ వర‌ణం, సేనాధిపతి ఉత్సవం, మృత స్సంగ్రహణం నిర్వహిస్తారు.

ఆగష్టు 19న ఉదయం పంచగవ్యా రాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.

ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహ వచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారని తెలిపింది టీటీడీ.

Also Read : MP Kesineni Sivanath Alarming : లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Exit mobile version