Pavithrotsavams Interesting Update : మ‌హా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మ వారి ఆల‌యంలో ఘ‌నం

Hello Telugu - Pavithrotsavams Interesting Update

Hello Telugu - Pavithrotsavams Interesting Update

Pavithrotsavams : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు (Pavithrotsavams) మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మ‌ధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేప‌ట్టారు.

Pavithrotsavams Interesting Update

ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మ వారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చ‌క్ర‌త్తాళ్వార్‌ను ప‌ల్ల‌కీపై ఊరేగింపుగా ప‌ద్మ పుష్క‌రిణి వ‌ద్ద‌కు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఆలయ తలుపులు మూసి వేశారు. అనంత‌రం సోమ‌వారం తిరిగి తెరిచారు. అంత‌కు ముందు శుద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వి వీరబ్రహ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, ఏఈఓ దేవరాజులు, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, సూపర్డెంట్లు రమేష్, శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ చ‌ల‌ప‌తి, శ్రీ సుభాష్‌ , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read : TTD Interesting Update : శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Exit mobile version