CM Revanth Reddy Interesting Comments : ఐటీ కంపెనీల‌కు కేంద్రం రాయ‌దుర్గం : సీఎం

పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ స్వ‌ర్గధామం

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

CM Revanth Reddy : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఐటీ కంపెనీల గురించి. రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు మౌలిక స‌దుపాయాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కంపెనీల‌కు సంబంధించి రాయ‌దుర్గం కేంద్రంగా ఉంద‌న్నారు సీఎం. ప్ర‌ధానంగా ఇక్క‌డ అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని స్ప‌ష్టం చేశారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులతో ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని అన్నారు సీఎం. నవంబర్ నెలాఖరు నాటికి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి ఏఐ హబ్, టీ-స్క్వేర్ నిర్మాణంపై సమీక్షించారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టులపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

CM Revanth Reddy Key Comments

టి స్క్వేర్ న‌గ‌రంలోనే ఒక ఐకానిక్ భవనంలా ఉండాలని, అందుకు అనుగుణంగా నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. టీ-స్క్వేర్ ఒక కేంద్రబిందువులా పర్యాటకులను ఆకర్షించడం, రెస్టారెంట్లు, వ్యాపార నిర్వహణ, కార్పొరేట్‌ వ్యవహారాల వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని డిజైన్ రూపొందించాలని అన్నారు. ఆ ప్రాంతం 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, రంగురంగుల డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్‌ప్లేతో రూపొందించాలి. యాపిల్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం అక్కడ వ్యాపారం నిర్వహించేలా ఉండాలని అన్నారు.

పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు ఉండాలన్నారు. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలతో పాటు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా టీ-స్క్వేర్ రూపుదిద్దు కోవాలని పేర్కొన్నారు.

Also Read : Deputy CM Pawan Interesting Comments : పునర్వ్యవస్థీకరణతో ప‌ల్లె పంచాయతీలు బలోపేతం

Exit mobile version