Pakistan-Afghanistan Important Meet : ఖ‌తార్ లో ఆఫ్గ‌నిస్తాన్ తో పాకిస్తాన్ చ‌ర్చ‌లు

జ‌ర‌ప‌నున్న‌ట్లు ధ్రువీక‌రించిన ఆఫ్గాన్ ప్ర‌తినిధి

Hello Telugu - Pakistan-Afghanistan Important Meet

Hello Telugu - Pakistan-Afghanistan Important Meet

Pakistan : ఖ‌తార్ : ఆఫ్గ‌నిస్తాన్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌తలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. సౌదీ అరేబియా తో పాటు ఇత‌ర దేశాలు సైతం ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరాయి. ఈ త‌రుణంలో ఖ‌తార్ వేదిక‌గా ఆఫ్గ‌నిస్తాన్ తో పాకిస్తాన్ (Pakistan) చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఛాన్స్ ఉంద‌ని ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. కానీ ఇంకా అధికారికంగా ఈ విష‌యం చ‌ర్చ‌కు రాలేదు. స‌రిహ‌ద్దు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. కాల్పుల విర‌మ‌ణ‌ను ఉల్లంఘించ‌డంపై ఇరు దేశాలు ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ కు భారీ న‌ష్టం సంభ‌వించింది. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ అధికారులు శనివారం ఖతార్‌లో తమ ఆఫ్ఘన్ సహచరులతో చర్చలు జరపనున్నారు.

Pakistan-Afghanistan Important Discussion in Qatar

రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ అసిమ్ మాలిక్ ఆఫ్ఘన్ తాలిబాన్‌తో చర్చల కోసం ఈరోజు దోహాకు వెళుతున్నారు అని పాకిస్తాన్ స్టేట్ టీవీ తెలిపింది. రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ఇస్లామిక్ ఎమిరేట్ నుండి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈరోజు దోహాకు బయలుదేరింది అని ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. 48 గంటల కాల్పుల విరమణ అనంత‌రం దాదాపు వారం రోజుల పాటు కొనసాగింది ర‌క్త‌పాతం. దీనివల్ల రెండు వైపులా డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించింది. పాక్ దాడుల్లో ముగ్గురు క్రికెట‌ర్ల‌తో పాటు ప‌లువురు పౌరులు, చిన్నారులు కూడా ఉ్నార‌ని ఆఫ్గాన్ ప్ర‌తినిధి ఆరోపించారు.

Also Read : Mukesh Ambani Growth : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్యూ2 ఫలితాలు: నికర లాభం రూ.18,165 కోట్లు

Exit mobile version