Padmavathi Devi Interesting Updates : శ్రీ పద్మావతీ అమ్మ వారి విశేష ఉత్సవాలు

సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కు తిరుచానూరు ఆల‌యంలో

Hello Telugu - Padmavathi Devi Interesting Updates

Hello Telugu - Padmavathi Devi Interesting Updates

Padmavathi Devi : తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తీ అమ్మ వారి విశేష ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. సెప్టెంబరు 2వ తేదీన శ్రీపద్మావతీ అమ్మవారి (Padmavathi Devi) అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఉంటుంద‌ని పేర్కొంది. 4న శ్రీపద్మావతీ అమ్మవారి పత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తామ‌ని తెలిపింది. 5 నుండి 7వ తేదీ వరకు పత్రోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. 7వ తేదీన‌ చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు ఆల‌యం మూసి వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

Padmavathi Devi Special Festivals

సెప్టెంబ‌రు 12, 19, 26వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌నం ఇస్తార‌ని తెలిపింది టీటీడీ. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో సెప్టెంబ‌రు 9న ఉత్తరా భాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామి వారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో సెప్టెంబ‌రు 14న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల‌కు పెద్దశేష వాహనంపై స్వామి వారు క‌టాక్షించ‌నున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సెప్టెంబ‌రు 23న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామి వారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇస్తార‌ని తెలిపింది.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో సెప్టెంబ‌రు 6, 13, 20 27వ‌ తేదీలలో శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు వేంక‌టేశ్వ‌ర స్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది టీటీడీ.

Also Read : TTD Gets Huge Donations : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి భారీ విరాళాలు

Exit mobile version