TTD Gets Huge Donations : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి భారీ విరాళాలు

ఆర్ఎస్బీ రీటైల్ ఇండియా లిమిటెడ్ రూ. 2.93 కోట్లు

hellotelugu-ttd

TTD : తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే బంగారంగా, కోట్లాది మంది భ‌క్తుల‌కు అభ‌మిచ్చే ఆ క‌లియుగ వేంకటేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తూనే ఉన్నారు. ఎక్క‌డ చూసినా ఆ ఆప‌ద మొక్కుల వాడిని స్మ‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌తి రోజూ తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని 75,000 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి కృప‌కు పాత్రులు అవుతున్నారు. పేద‌లు, ధ‌న‌వంతులు, ప్ర‌ముఖులు, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా, సినీ , ఐటీ, లాజిస్టిక్ త‌దిత‌ర రంగాల‌కు చెందిన వారంతా స్వామి చెంత‌కు వ‌స్తున్నారు. త‌మ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తాము కోరిన కోర్కెల‌ను స్వామి తీరుస్తుండ‌డంతో పెద్ద ఎత్తున విరాళాల‌ను స్వామికి అందజేస్తున్నారు.

TTD Huge Donations

ఆదివారం హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ టీటీడీ (TTD) బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది.అదే విధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.

కాగా నర్సారావు పేటకు చెందిన శ్రీ జె.రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

Also Read : Minister Nara Lokesh Important Invitation : మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

Exit mobile version