Minister Nara Lokesh Interesting Comments : డేటా విప్లవం అవ‌కాశాలు అపారం – నారా లోకేష్

పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు

Hello Telugu - Minister Nara Lokesh Interesting Comments

Hello Telugu - Minister Nara Lokesh Interesting Comments

Nara Lokesh : విజయవాడ: డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అంది పుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యాన జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఐ, డాటా సెంటర్లపై జరిగిన చర్చలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎపి రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందన్నారు. ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుంద‌ని చెప్పారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు.

Minister Nara Lokesh Comments

అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలో విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు సాంప్రదాయ విద్యావిధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఎఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్సఫార్మేషన్ కష్టతరమైన పనేనని అన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఎఐ స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ లను ప్రవేశ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టంచారు. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నామ‌న్నారు.

రోజువారీ పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. పాదయాత్ర సమయంలో ప్రజలు సాధారణ ల్యాండ్ రికార్డుల కోస ఇబ్బందులు పడటం నేరుగా గమనించానని అన్నారు. అందుకోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు సులభతరమైన పౌరసేవలు అందించడంపై దృష్టి సారించిన‌ట్లు చెప్పారు నారా లోకేష్. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టి 600 రకాల పౌరసేవలను ప్రజలకు వేగవంతంగా అందిస్తున్నామ‌న్నారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వశాఖలను అనుసంధానిస్తూ అతి పెద్ద బ్యాక్ ఎండ్ డేటా లేక్ ను తయారు చేశామ‌న్నారు.

Also Read : Supreme Court Fired on Kanchagachibowli : కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం సీరియ‌స్

Exit mobile version