Oats : రోజుకో కొత్త వంటకం కోసం ఆలోచించే ఇంటి తల్లులకి ఇది శుభవార్తే. సులభంగా తయారయ్యే, ఆరోగ్యాన్ని బలపరిచే ఓట్స్ ఇడ్లీ ఇప్పుడు అల్పాహార మెనూలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పౌష్టిక విలువలతో నిండిన ఈ ఇడ్లీ, ఇనిస్టెంట్‌గానే తయారవడం విశేషం.
Oats Interesting Recipe..
ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు కూడా అందుబాటులో ఉండేలా ఉన్నాయి. ఒక కప్పు ఓట్స్‌ను (Oats) (రోల్డ్ లేదా ఇనిస్టెంట్) మిక్సీలో కొద్దిగా పొడిగా చేసుకోవాలి. దీనితో పాటు చిలికిన పెరుగు, నూనె, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, తురిమిన క్యారెట్, కరివేపాకులు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీరు ఉపయోగిస్తారు.
ముందుగా ఓట్స్‌ను పొడిగా చేసి పక్కన పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పప్పులన్నీ వేయించి, తరువాత ఉల్లిపాయ, మిరపకాయ, అల్లం, కరివేపాకు వేసి స్వల్పంగా వేయించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఓట్స్ పొడిలో కలిపి, అందులో క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, పెరుగు కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయాలి.
ఈ పిండిని ఇడ్లీ స్టాండ్‌లో పోసి, స్టౌ మీద 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. విజిల్ లేకుండానే వీటిని వండాలి. ఫలితంగా మృదువైన, ఆరోగ్యవంతమైన ఓట్స్ ఇడ్లీలు సిద్ధమవుతాయి.
వీటిని నచ్చిన చెట్నీతో వడ్డిస్తే రుచి రెట్టింపవుతుంది. సాంప్రదాయ వంటకాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలిచే ఈ ఓట్స్ ఇడ్లీ, రుచి కోరే వారిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కోరేవారిని కూడా మెప్పిస్తోంది.
Also Read : Milk and Curd Interesting Facts : మీరు ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారా అయితే ఇది చూడండి
