Nirmala Sitharaman : అమరావతి : ప్రజా రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈరోజు ఒక ముఖ్యమైన అడుగు అని స్పష్సం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). 15 బ్యాంకింగ్ , పబ్లిక్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం అమరావతిలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్, నారాయణ, సీఎస్ విజయానంద్. ఈ సందర్భంగా తనను ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఆధునిక ఆర్థిక కేంద్రంగా అమరావతి పాత్రను నిలబెట్టే ప్రణాళికా బద్ధమైన ఆర్థిక జిల్లాలో భాగంగా ఈ సంస్థలకు భూమిని కేటాయించడం జరిగిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Union FM Nirmala Sitharaman Key Comments on AP
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. సహకారం అందజేస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అమరావతి స్వర్ణ ఆంధ్ర పురోగతికి మూలస్తంభంగా, విక్షిత్ భారత్‌కు దోహదపడే గర్వించదగిన, డైనమిక్ నగరంగా నిలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మరో కీలక ప్రకటన చేశారు సీఎం. అమరావతిలో కాస్మోస్ ప్లానిటోరియం రాబోతోందని చెప్పారు. ఈ అత్యాధునిక సౌకర్యం మన విద్యార్థులకు అంతరిక్ష అద్భుతాలను దగ్గరగా తీసుకు వస్తుందని అన్నారు. మన విశ్వం, దాని గ్రహాలు, నక్షత్రాలు, సుదూర గెలాక్సీల ద్వార దృశ్య ప్రయాణాన్ని అందిస్తుందని చెప్పారు సీఎం. ఈ ప్లానిటోరియం శాస్త్రీయ ఉత్సుకతను పెంచుతుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : Priyank Kharge Shocking Comments : సీఎం మార్పు పై అధిష్టానందే తుది నిర్ణయం
