Nirmal Kumar Minda Growth : అసోచామ్ అధ్య‌క్షుడిగా నిర్మ‌ల్ కుమార్ మిండా

బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఆనందంగా ఉంది

Hello Telugu - Nirmal Kumar Minda Growth

Hello Telugu - Nirmal Kumar Minda Growth

Nirmal Kumar Minda : ముంబై : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అసోచామ్ అధ్య‌క్షుడిగా నిర్మ‌ల్ కుమార్ మిండా (Nirmal Kumar Minda) కొలువు తీరారు. ఆయ‌న ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇదిలా ఉండ‌గా మిండా అద్బుత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఆటో కాంపోనెంట్ రంగంలో మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉన్నారు. గ‌త 5 ద‌శాబ్దాలుగా ఆటో ప‌రిశ్ర‌మ‌లో కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా ఉంటూ వ‌చ్చారు. తాను అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం నిర్మ‌ల్ కుమార్ మిండా మీడియాతో మాట్లాడారు. మార్పు అన్న‌ది స‌హ‌జ సిద్ద‌మ‌ని అన్నారు. దీనిని ఎల్ల‌ప్పుడూ స్వీక‌రించేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు. భ‌విష్య‌త్తు అనేది ఎంతో దూరంలో లేద‌న్నారు.

Nirmal Kumar Minda Growth

యునో మిండా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ గా ప్ర‌స్తుతం నిర్మ‌ల్ కుమార్ మిండా ఉన్నారు. ప్ర‌స్తుతం కీల‌క‌మైన‌ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా చీఫ్ గా కొలువు తీర‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు. ఈ ప‌ద‌వి త‌న ప‌నితీరుకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఆటో పరిశ్రమలో విస్తృత అనుభవం ఉన్న మిండా, సోరిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ సంజయ్ నాయర్ స్థానంలో తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఎఫ్ఓ అమితాబ్ చౌదరి అసోచామ్ కొత్త సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ కార్య‌వ‌ర్గం పూర్తిగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లోబ‌డి ఉంది.

Also Read : Harish Rao Fired on CM Revanth Reddy : ఏం చేశార‌ని ఈ విజ‌యోత్స‌వాలు..?

Exit mobile version