Harish Rao Fired on CM Revanth Reddy : ఏం చేశార‌ని ఈ విజ‌యోత్స‌వాలు..?

నిప్పులు చెరిగిన హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on CM Revanth Reddy

Hello Telugu - Harish Rao Fired on CM Revanth Reddy

Harish Rao : హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అసలు ఏం చేశార‌ని విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించారంటూ ప్ర‌శ్నించారు. రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా అని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా అని ఫైర్ అయ్యారు. రూ. 1300 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటికీ రైతులకు చెల్లించినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హ‌రీశ్ రావు.

MLA Harish Rao Slams CM Revanth Reddy

లగచర్ల, రాజోలి రైతుల చేతుల చేతులకు బీడీలు వేసినందుకా? మొదటి ఏడాడిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని యువతను మోసం చేసినందుకా? నిరుద్యోగ భృతి ఎగ్గొడుతున్నందుకా? మహాలక్ష్మి పేరిట నెలకు రూ. 2500 ఇస్తానని, ఇప్పటికీ అమలు చేయనందుకా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకా, అవ్వా తాతలకు పించన్లు పెంచనందుకా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకా? మూసీ సుందరీకరణ పేరుతో కమీషన్లు దండుకుంటున్నందుకా అని ఎద్దేవా చేశారు హ‌రీశ్ రావు. ఎందుకు విజయోత్సవాలు చేస్తా అంటున్నవు అంటూ రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇంకెంత కాలం మోసం చేస్తారు, ఇంకెంత కాలం మభ్యపెడుతరు. 22 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెట్టినవు. ఎందుకోసం ఉత్సవాలు జరుపుతావు అంటూ ఫైర్ అయ్యారు.

Also Read : India-Sri Lanka Strong Bond : శ్రీ‌లంక‌, భార‌త్ ల మధ్య బంధం బ‌లోపేతం

Exit mobile version