Night Sweats Shocking : రాత్రుళ్ళు కాలంతో పని లేకుండా చెమటలు పడుతున్నాయా..ఈ వ్యాధి లక్షణాలు కావచ్చు

ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కనిపించొచ్చని చెబుతున్నారు...

Hello Telugu - Night Sweats Shocking

Hello Telugu - Night Sweats Shocking

Night Sweats : వేసవి కాలంలో లేదా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరం చెమట ద్వారా వేడిని బయటకు పంపడం సహజమే. అయితే స్పష్టమైన కారణం లేకుండా, ముఖ్యంగా రాత్రి సమయంలో పదే పదే చెమటలు పట్టడం (Night Sweats) జరుగుతోంటే అది గమనించదగ్గ అంశమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కనిపించొచ్చని చెబుతున్నారు.

Night Sweats – రాత్రిపూట చెమటలు పట్టడం వెనుక గల కారణాలు:

హార్మోన్ల అసమతుల్యత

మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే మార్పులు — ముఖ్యంగా పీరియడ్స్‌కు ముందు లేదా మెనోపాజ్ సమయంలో — చెమటలు అధికంగా రావడానికి కారణమవుతాయి. అలాగే పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిల తగ్గుదల, థైరాయిడ్ గ్రంథి సంబంధించిన సమస్యల వల్ల కూడా రాత్రిపూట చెమటలు రావచ్చు.

ఇన్ఫెక్షన్లు

ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా రాత్రుళ్లు చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, తరచూ జ్వరంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే, అది క్షయ రోగం (ట్యుబర్‌కులోసిస్ – TB) కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. HIV, మలేరియా, బ్రూసెల్లోసిస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లలోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది.

మానసిక ఒత్తిడి

ఆందోళన, డిప్రెషన్, అధిక ఒత్తిడి శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తూ, రాత్రిపూట చెమటలు పట్టేలా చేయవచ్చు. మెదడు నుంచి స్ట్రెస్ హార్మోన్ల విడుదల అధికమవడం దీని వెనుక గల ముఖ్యమైన కారణం.

మందుల దుష్ప్రభావం

కొన్ని యాంటీడిప్రెసెంట్‌లు, ఫీవర్ తగ్గించే ఔషధాలు (ప్యారాసిటమాల్ మొదలైనవి) శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి చెమట పట్టించవచ్చు. దీని పర్యవసానంగా నిద్ర సమయంలో చెమటలు రావడం సాధ్యమే.

అప్రమత్తంగా ఉండాలి

Also Read : Cycling Health Interesting Benefits : ప్రతిరోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే తరువాతి లాభాలు ఊహించలేరు

Exit mobile version