భారీ ధ‌ర‌కు ప‌వ‌ర్ స్టార్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

స్వంతం చేసుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్ర‌క‌ట‌న

hellotelugu-UstadBhagatSingh

హైద‌రాబాద్ : ఈ ఏడాదిలో రానుంది ప‌వ‌ర్ స్టార్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. చాన్నాళ్ల త‌ర్వాత డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన మూవీ గ‌బ్బ‌ర్ సింగ్ దుమ్ము రేపింది. సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. త‌న‌కు బిగ్ స‌క్సెస్ ఇచ్చింది. అయితే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగి పోయింది. భారీ బ‌డ్జెత్ తో దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను పొందేందుకు భారీ పోటీ ఏర్ప‌డింది. చివ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ ను దాటేసి నెట్ ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ విష‌యాన్ని ఇంకా ధ్రువీక‌రించ లేదు మూవీ మేక‌ర్స్, నెట్ ఫ్లిక్స్ యాజ‌మాన్యం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. వ‌చ్చే ఏప్రిల్ లో ఫ్యాన్స్ కు పండుగ వాతావ‌ర‌ణం క‌ల్పించేలా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించాడు. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్ప‌టి నుంచే సంబురాల‌లో మునిగి పోయారు. మొత్తంగా డిజిట‌ల్ రైట్స్ విషయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రికార్డ్ బ్రేక్ చేశాడు.

Exit mobile version