CM Revanth Reddy – Rains Alarming : వ‌ర్షాల ప్ర‌భావం అప్ర‌మ‌త్తం అవ‌స‌రం – సీఎం

జిల్లా క‌లెక్ట‌ర్లు అల‌ర్ట్ గా ఉండాల‌ని ఆదేశం

Hello Telugu - CM Revanth Reddy - Rains Alarming

Hello Telugu - CM Revanth Reddy - Rains Alarming

CM Revanth Reddy : హైద‌రాబాద్ – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప‌లు చోట్ల వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది. లోత‌ట్టు ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్క‌డి నుంచే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావుతో మాట్లాడారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇదే సమ‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లను అలెర్ట్ చేయాల‌ని ఆదేశించారు.

CM Revanth Reddy Comments

ఈ సంద‌ర్బంగా సీఎస్ సీఎంతో మాట్లాడుతూ వ‌ర‌ద‌ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. రక్షణ చర్యల కోసం అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. వర్షానికి సంబంధించిన వాతావరణ శాఖ సూచనల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్రజలకు తెలియ జేయాలని, అన్ని విభాగాలతో పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. మాట్లాడి వరద పరిస్థితి, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రత గురించి ఆరా తీశారు.

అతి భారీ వర్షాల ప్రాంతాల్లో నివసించే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద నీటితో నిండిన చెరువులు, నీటి వనరుల సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని స్ప‌ష్టం చేశారు. GHMC పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వర్షాలు, వరదల కారణంగా తలెత్తే ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లాల్లో అధికారులు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల సమయంలో అన్ని రకాల సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులు కలెక్టర్లతో సంప్రదిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సూచించారు.

Also Read : TTD Interesting Comments : శ్రీ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌న మ‌హా సంప్రోక్ష‌ణ

Exit mobile version